తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్‌లు ఉండే ఆహారాలు

low calorie high protein foods

ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలు మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ని అందిస్తూనే, బరువు తగ్గించడానికి సహాయపడతాయి.

పప్పు దినుసులు 

మినపప్పు , శనగపప్పు, కందులు  - ఇవన్నీ ప్రొటీన్‌తో పాటు ఫైబర్‌ కూడా అధికంగా ఉంటాయి. వీటితో ఇడ్లీలు , దోశలు , పులుసులు తయారు చేసుకుని తినవచ్చు.

పనీర్ 

పాల ఉత్పత్తి అయిన పనీర్‌లో కొవ్వు చాలా తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువ. పాలక పనీర్ వంటి వంటకాలు చేసుకుని తినవచ్చు.

బఠానీలు

ప్రొటీన్‌, ఫైబర్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా బఠానీలలో లభిస్తాయి. వీటిని కూరగాయలతో కలిపి వండుకుని తినవచ్చు.

చేపలు 

కొవ్వు తక్కువగా ఉండే సాల్మన్, రొయ్య వంటి చేపలలో ప్రొటీన్‌ ఎక్కువ. అవి ఆరోగ్యానికి కూడా మంచివి. 

గుడ్డు 

గుడ్డులో ప్రొటీన్‌ పాటు విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కేలరీలు తక్కువ. వారానికి 3-4 గుడ్లు తినవచ్చు. 

బ్రకోలి 

బ్రకోలి కూరగాయలో ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు చాలా ఉన్నాయి. కేలరీలు మాత్రం తక్కువ. 

పెరుగు 

పెరుగు శాఖాహారులకు మంచి ప్రొటీన్‌ . అంతేకాకుండా ప్రేగు  ఆరోగ్యానికి కూడా మంచిది. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలు ఉంటాయి. 

డ్రై ఫ్రూట్స్‌

జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఎండుద్రాక్షల వంటి గింజలను ప్రతిరోజూ తీసుకోవడం మంచిది. వీటిలో ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి

చిట్కా 

మీరు వండుకునే నూనె  పై కూడా శ్రద్ధ వహించండి. వంట నూనె కన్నా  ఆలివ్ నూనె  ఆరోగ్యానికి మంచిది. 

రోజుకు 2 లవంగాలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య లాభాలు

Read Next Web Story