కొబ్బరి నీరు తాగడం వల్ల ఏమి ప్రయోజనాలు?
ఎండవేడిమి నుండి రక్షిస్తుంది
వేసవి తాపం తట్టుకోవడానికి.. బెస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్.. కొబ్బరి నీళ్లు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి ఎండలో తాపాన్ని తగ్గిస్తుంది.
డిహైడ్రేషన్ తగ్గిస్తుంది
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండడం వల్ల నీటినపత్తు తగ్గిస్తుంది. అనేక అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది
ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
ఎముకల బలాన్ని పెంచుతుంది
ఇందులో కాల్షియం మరియు మాంగనీస్ ఉండడం వల్ల ఎముకలు మరియు పళ్ళు బలంగా ఉంటాయి.
హృదయ ఆరోగ్యానికి మంచిది
ఇది కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్ధం చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, ఫ్యాట్ లేకపోవడం వల్ల గుండెకు హాని లేదు.
చర్మానికి కాంతినిస్తుంది
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మానికి కాంతి మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆంటీ-ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ముడతలు మరియు మచ్చలు తగ్గిస్తుంది.
విషపూరిత పదార్థాలను తొలగిస్తుంది
కొబ్బరినీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. యూరిన్ ఎక్కువగా విసర్జించడానికి సహాయపడి కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
షేర్ చేసి ఇతరులకు కూడా తెలియజేయండి!
read Next
Read Next